ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగు తమ్ముళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి.ఎందుకంటే ఒక్కటంటే ఒక్కటే ఇంటర్య్వూ తెలుగుదేశం నాయకులకు చెమటలు పట్టిస్తోందంటున్నారు. అధి ఏమీటంటే ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ ఆదివారం ప్రసారం అయ్యింది. మొత్తం ఇంటర్వ్యూ 45 నిమిషాల పాటే ఉన్నా జగన్ చెప్పిన ప్రతి మాట ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై జగన్ సంధించిన విమర్శనాస్త్రాలు ఆ పార్టీ శ్రేణులకు చుక్కలు చూపించాయంటున్నారు. “నన్ను ఉద్దేశించి తెలుగుదేశం నాయకులు ఆ నా కొడుకు… ఈ నా కొడుకు అంటూ వ్యాఖ్యలు చేస్తారు. ఓ రాజకీయ పార్టీ నాయకుడిగా… దేశంలో అందరి కంటే సీనియర్ నాయకుడిని అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు వారిని వారించరు. ఇదీ ఆయన తీరు” జగన్ మండిపడ్డారు. జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా చేసిన ఈ ఇంటర్య్వూలో రాష్ట్ర అంశాలతో పాటు జాతీయ రాజకీయాల పట్ల కూడా జగన్ విపులంగా చర్చించడం అటు తెలుగుదేశం నాయకులకు ఇబ్బందిని కలిగిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి జగన్ ఇంటర్య్వూ తెలుగుదేశం శ్రేణులకు నిద్ర లేకుండా చేస్తోందని తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం జరుగుతోందంటున్నారు.
