చంద్రబాబు చేసినంత అవినీతి, దోపిడీ మరొకరు చేసి ఉండరంటున్నారు విశ్లేషకులు.నాలుగున్నరేళ్ల పాలనలో ఏకంగా రూ.6,17,585.19 కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. చంద్రబాబు అవినీతిపై ఏపీ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకం చర్చనీయాంశంగా మారింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో పరిశోధించి బాబు చేసిన అవినీతి, దోపిడీ, అక్రమాలను ఈ పుస్తకంలో వివరించింది.
గత పాలనలోని చివరి రెండేళ్లు, ప్రస్తుత నాలుగున్నరేళ్ల పాలనలో బాబు చేసిన దోపిడీని మరోసారి పుస్తకరూపంలో ఆవిష్కరించింది. ప్రపంచ రాజకీయాల్లో ఏ వ్యక్తి పాలనలో కూడా చంద్రబాబు చేసినంత అవినీతి, దోపిడీ మరొకరు చేసి ఉండరనే అనుమానాలు కలుగుతున్నాయి. ఘజనీ, మహ్మద్ ఘోరీ, నాదిర్షాల కంటే చంద్రబాబు దారుణంగా దోపిడీ చేశారని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు.