ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అవినీతి పుస్తకం ప్రతిపక్షనేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాయించడం దొంగే దొంగ అన్న చందగా ఉందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. అవినీతి జగనే ఆద్యుడని, అందుకే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరౌతున్నాడని విమర్శించారు. లక్షల కోట్లు దోచుకున్న చరిత్రకు జగన్ పాదయాత్ర పైలాన్ సాక్షంగా మిగిలిపోతుందన్నారు. తెలంగాణ జరిగే పనులలో జగన్ సబ్ కాంట్రాక్టర్ అని అన్నారు.తమకు ప్రాణహాని ఉన్నదని బీజేపీ నాయకులు అనడం అర్థరహితమన్న బుద్దా వెంకన్న, మోడీ సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు పై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు.
