Home / NATIONAL / ప్రధాని మోదీ సంచలన నిర్ణయం..!!

ప్రధాని మోదీ సంచలన నిర్ణయం..!!

ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాల వారికి విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడాదికి రూ.8 లక్షలకు తక్కువ ఆదాయం ఉన్న అగ్ర కులాల వాళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీంతో ప్రస్తుతం 50 శాతం ఉన్న రిజర్వేషన్లు 60 శాతానికి చేరనున్నాయి. ఈ మేరకు కేంద్రం రాజ్యాంగ సవరణ చేయనుంది. మంగళవారమే దీనికి సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ఆమోదం కోసమే పార్లమెంట్ శీతాకాల సమావేశాలను మరో రెండు రోజుల పాటు పొడిగించే అవకాశం ఉంది.

లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి వ్య‌తిరేక ఫ‌లితాలు వ‌చ్చిన నేప‌థ్యంలో కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat