ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేత పత్రాలపై జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఏపీలో ఎక్కడా అభివృద్ధి జరగడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ పునాదులు దాటలేదు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతప్రతాలు ఒక బూటకం. ఏపీలో పాలన ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసన్నారు. రైతు రుణమాఫీని సమర్ధించను అని తాను ఎప్పుడు చెప్పనని, కానీ రుణమాఫీ సాధ్యాసాధ్యాల గురించే నేను మాట్లాడాను. కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తానంటే.. ముందుగా సంతోషించేది నేనే. నేను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతా.
పాదయాత్ర మొదలు పెట్టక ముందే.. రైతు భరోసా గురించి చెప్పాను. ప్రతి రైతు కుటుంబానికి మే నెలలో రూ.12,500 ఇస్తాం. నాలుగు దఫాలుగా రూ.50 వేలు చొప్పున ఇస్తాం. మన రాష్ట్రంలో చిన్న కమతాలు ఉన్న రైతులే ఎక్కువ. అందుకే రైతు భరోసా రైతు కుటుంబాన్ని ఒక యునిట్‌గా తీసుకున్నాం. రైతుల దగ్గర తక్కువ ధరకు కొని.. చంద్రబాబు తన హెరిటేజ్ ద్వారా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. నాలుగేళ్లు కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగినా.. చంద్రబాబు పొగుడుతూ వచ్చారు. చంద్రబాబు అవినీతి చేస్తున్నా.. మన భాగస్వామియే కదా అని మోదీ వదిలేశారు. అని జగన్ అన్నారు.