ఏపీ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు హోరాహోరిగా తలపడనున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ , ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ మరోక పార్టీ జనసేనా . 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ ఈ సారి అలాంటి పొరపాట్లు లేకుండా వ్యూహాత్మకంగా ముందుకెల్తోంది.ఎన్నికల సమయం కాబట్టి జంపింగ్‌లు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా ఇతర పార్టీలనుంచి వైసీపీలోకి వలసలు కొనసాగతున్నాయి. ఇప్పటికే కర్నూల్ జిల్లాలోని ఆళ్లగడ్డకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.తాజాగా జిల్లాలోని ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి వైసీపీలో చేరుతున్నారు. ఇందులో బాగాంగానే నిరజా రెడ్డి వైసీపీ అధినేత వై ఎస్ జగన్ ని పాదయాత్రలో కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎమ్మెల్యేగా పని చేసిన నిరజా రెడ్డికి ఆలూరు నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఈమె రాకతో వైసీపీకి మరింత బలం వచ్చింది. తెలుగుదేశం పార్టీ..కాంగ్రెస్ పార్టీ పోత్తుతో ఏపీలో నీచపు రాజకీయాలు జరుగ్తున్నాయని, అందుకే తాను పార్టీ మారతునున్నానని జగన్ తో వాపోయినట్లు సమాచారం. అంతేకాదు రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఇంకా చాలమంది నాయకులు ఇతర పార్టీల్లోకి వలసలు వెళ్తున్నారు.