ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జగన్ పై గత ఏడాది వైజాగ్ విమనాశ్రయంలో కోడి కత్తితో అక్కడ ఉన్న రెస్టారెంట్లో పని చేసే శ్రీనివాస్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో జగన్ పై జరిగిన ఈ దాడి గురించి ఏపీ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కేసును ఎన్ఐఏకు అప్పచెబుతూ కీలక ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా వైజాగ్ నగరానికి వెళ్ళిన ఎన్ఐఏ బృందానికి గట్టి షాక్ తగిలింది.ఈ రోజు కేసు విచారణలో భాగంగా వైజాగ్ కు వెళ్లిన ఈ బృందానికి నగర పోలీసులు దిమ్మతిరిగే షాకిచ్చారు.కేసుకు సంబంధించిన వివరాలను ఈ బృందానికివ్వడానికి నిరాకరించారు. అంతే కాకుండా ప్రభుత్వం అనుమతి లేకుండా ఇవ్వడం అసాధ్యం అని తేల్చి చెప్పారు.