ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో భారీగా వలసలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న కొద్ది వైసీపీ పార్టీలలోకి వలసలు ఊపందుకున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా కర్నూల్ జిల్లా ఆలూరు నియోజక వర్గంలోని గుమ్మనూరు గ్రామంలో అలూరు మండలం మోలగవల్లి గ్రామం నుండి దాదాపు 40 కుటుంబాలు వైసీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వం 4సంవత్సరాలుగా రైతులకు గాని, విద్యార్థులకు గాని ఏటువంటి న్యాయం చేయలేక పోవడం వల్ల వైసీపీలోకి చేరుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్ పాదయాత్ర తోనే సాధ్యం అని గ్రహించి మరియు అలూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ తోనే సాధ్యం అని గ్రహించిఈ రోజు వైసీపీ పార్టీ లో ఎమ్మల్యే ఆధ్వర్యంలో చేరడం జరిగింది. వైసీపీలోచేరిన వారు మహేష్ యాదవ్ , సురేంద్ర ,ఖాదర్ భాష, మంగలి వినోద్ కుమార్, విజయ్ యాదవ్ , దస్తగీరి తదితరులు ఉన్నారు.