ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులని అలరించిన జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్‌గా టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జగపతి బాబు తన సెకండ్ ఇన్నింగ్స్‌ని మొదలు పెట్టాడు. కేవలం విలన్ పాత్రలోనే కాక సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. అయితే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. వైఎస్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారాన్ని ‘యాత్ర’ రూపంలో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటించారు. వైఎస్ఆర్ తండ్రి రాజా రెడ్డి పాత్రని జగపతి బాబు చేస్తుండగా, ఆయన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. ఇందులో జగపతి బాబు లుక్ అదిరిపోయిందని అంటున్నారు. రావు రమేశ్, సుహాసిని, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్సార్ సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేశ్ కనిపించనున్నారట. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనసూయ కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదల కానుంది.
