సినీ ఇండస్ట్రీ లో దైవంగా భావించే నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఎన్టీఅర్ గా ఆయన కొడుకు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు.క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.ఆడియో ఫంక్షన్ తదితర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సమయంలో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు షాకిచింది.ఎన్టీఆర్ బయోపిక్ అంటే చిత్రంలో చాలామంది గురించి చూపించాల్సి ఉంటుంది.నటులు,రాజకీయ నాయకులు,వారి గురించి తప్పనిసరిగా చూపించాలి.
అయితే సినిమా విడుదల అయ్యాక అభ్యంతరాలు రాకుండా ఉండలంటే వారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకురమ్మని చిత్ర నిర్మాతలను సెన్సార్ బోర్డ్ కోరిందట. ఎప్పుడు ఏ సినిమాకు ఇలా సర్టిఫికెట్ అడగని సెన్సార్ బోర్డ్, మా సినిమాకే ఎందుకు అడుగుతుందని ప్రశ్నిస్తున్నారు చిత్ర నిర్మాతలు. అందరి దగ్గరకు వెళ్లి సర్టిఫికెట్ ఇవ్వండని అడగడం కుదరదు కాబట్టి వీరందరికీ ఓ స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నాడు బాలయ్య.ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల మనోహర్ కూడా ఈ సినిమాను మొదట నాకు చూపించి , విడుదల చేయలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇటుంవటి పరిస్థితులలో బాలయ్య ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.అందరి దగ్గరుకు వెళ్లి నో అబ్జెక్షన్ లెటర్ తెస్తారా లేదు తన ప్లాన్ ఉపయోగించి అందరిని సైలెంట్ చేస్తాడా అనేది తెలియాలి.