ప్రతీ ఏడాది నూతన సంవత్సర ప్రారంభ రోజున తిరుమల ప్రముఖులు..భక్తుల తో కిక్కిరిసి పోతుంది. అటువంటి తిరుమ ల లో ఈ సారి రద్దీ సాధారణంగా కనిపిస్తోంది. ప్రముఖలు తాకిడి తగ్గింది. అధికారులు అన్ని రకాలుగా ఏర్పట్లు చేసినప్ప టికీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 4 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 56,691 మంది భక్తులు దర్శించుకున్నారు. 16,649 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 1.97 కోట్లుగా ఉంది.