శబరిమలలో మహిళ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు.అయ్యప్ప ఆలయాన్ని 50 ఏళ్ల వయసులోపు మహిళలు ఇద్దరు దర్శించుకోవడం తీవ్ర దుమారానికి దారితీసింది. మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంపై నిన్నటి నుంచి హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. హిందూ సంస్థలతో ఏర్పడిన శబరిమల కర్మ సమితి, అంతరాష్ట్రీయ హిందూ పరిషత్తు మేరకు గురువారం కేరళలో బంద్ కొనసాగుతోంది.బంద్ పెద్ద ఎత్తున చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు.
గురువారం ఉదయం 6 గంటల నుంచే ఆందోళనకారులు రోడ్లపైకి చేరి వాహనాలను అడ్డుకొని టైర్లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలను మూసివేయించారు.తిరువనంతపురం, కాలికట్, మలప్పురం తదితర ప్రాంతాల్లోనూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
బంద్ కారణంగా రాష్ట్రంలోని పలు యూనివర్శిటీలు పరీక్షలు వాయిదా వేశాయి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేరళకు వెళ్ళు బస్సు సర్వీసులను నిలిపివేసింది.మరోవైపు ఆందోళనల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఇది ఇలా ఉనడగా పండలం ప్రాంతంలో సీపీఎం, భాజపా కార్యకర్తల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన చంద్రన్ ఉన్నితన్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ అర్ధరాత్రి తర్వాత మృతిచెందాడు. చంద్రన్ శబరిమల కర్మ సమితి సభ్యుడు. చంద్రన్ మృతిపై భాజపా తీవ్రస్థాయిలో మండిపడింది. అయ్యప్ప భక్తుడిని చంపేశారంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తింది.ఇది శబరిమల గొడవ నుండి సీపీఎం, భాజపా పార్టీ గొడవలుగా మారింది.ఇ గొడవలు ఇప్పుడు తగ్గుతాయి..లేదా ఎంతకు దారి తీస్తాయి అనేది వేచి చూడాల్సిందే.