నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.అయితే తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు నమోదు చేసింది.టీమిండియా బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పుజారా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.ప్రస్తుత టెస్టులో అమోఘంగా రాణిస్తున్న పుజారా చివరి టెస్ట్‌లోనూ సెంచరీ చేసి సత్తా చాటాడు.ఓపెనర్ రాహుల్ (9) అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్ మయాంక్ తో కలిసి 100 పరుగులు తాటించాడు.చివరుకు 199 బంతుల్లో శతకాని పూర్తి చేసుకొని సిసలైన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.
దీంతో పుజారా తన టెస్ట్ కెరీర్‌లో 18వ సెంచరీ నమోదు చేసుకున్నాడు.ఈ సిరీస్‌లో పుజారాకిది మూడో సెంచరీ. కాగా, పుజారా మరో అరుదైన రికార్డును కూడా చేరుకున్నాడు. ఈ సిరీస్‌లో పుజారా 200 లేదా అంతకంటే ఎక్కువ బంతులు ఆడడం ఇది నాలుగో సారి. ఆస్ట్రేలియాలో ఒక భారత బ్యాట్స్‌మెన్ నాలుగు సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ బంతులను ఎదుర్కోవడం ఇదే తొలిసారి.పుజారాతోపాటు విహారి (39 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజెల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్, లియాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.