ఔను వాళ్లిద్దరూ కలిసే ఉన్నారు. పవనాలు, చంద్రాల్ సార్లు విడిపోయినట్టు కొంతకాలం విమర్శలు చేసుకుంటున్నట్టు కనిపించారంతే. కానీ వాళ్లిద్దరూ కలిసే ఉన్నారట… ఒకరిని అంటే మరొకరికి కోపం వచ్చేంత ఇదిగా ఇద్దరూ కలిసే ఉన్నారట.. మేం ఒకరికి ఒకరై కలిసుంటే రాష్ట్రానికి నష్టమేంటని చంద్రబాబే స్వయంగా ప్రజల్నే ప్రశ్నించేంత పచ్చగా కలిసున్నారు. మరి కలిసున్నప్పుడు కలిసున్నట్టే ఉండక, కలిసుండనట్టు కటింగులు ఎందుకిస్తున్నారో తెలుసా.. చంద్రబాబు నోట మళ్లీ ఒక కుట్ర లాంటి మాట బటయకొచ్చింది. నిన్నటివరకు జగన్, పవన్, మోదీ ఒక్కటయ్యారంటూ ఊకదంపుడు డబ్బాకొట్టిన చంద్రబాబు, అది కాస్తా వర్కవుట్ అవ్వకపోవడంతో అసలు విషయం బయటపెట్టాడు.
పవన్ తో తనకున్న దోస్తీని చెప్పారు. పైగా ఒకడుగు ముందుకేసి అవును.. మేము పవన్ కలిస్తే జగన్ కు ఏంటి అని నిస్సిగ్గుగా ప్రశ్నించారు 40ఇయర్స్ చంద్రబాబు. తన తప్పులు కప్పుకోడానికి ఎప్పుడూ ఏదో ఒక తోలుకప్పుకుని డోలు వాయించుకునే చంద్రబాబు ఇప్పుడు కొత్తగా కేసిఆర్, మోదీ, జగన్ ఒక్కటే అంటూ కుట్ర రాగం అందుకున్నారు. పవన్ పేరు ఇటీవల ఎందుకు వదిలేశాడా? అని జనం ఆలోచించే లోపేం తనకు జనసేనకు ఉన్నఒప్పందం గురించి మళ్లీ బయటపెట్టారు చంద్రబాబు. మొన్నటివరకూ బీజేపీతో, సీపీఐ, సీపీఎం లతో ఇప్పుడు కాంగ్రెస్ తో హరికృష్ణ చావువద్ద టీఆర్ఎస్ తో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తూ.. గతంలో కలిసి ఇప్పుడు వదిలేసి మళ్లీ నిస్సిగ్గుగా కలవబోతున్న జనసేనతోనూ చంద్రాల్ పవనాల్ రాజకీయ వ్యభిచారం చూస్తున్న ప్రజలు థూ మీ బతుకులు చెడ అంటున్నారు.