రీసెంట్ గా ట్విట్టర్ లో తెలుగు యాంకర్ రష్మీకి ఒక నెటిజన్ నుంచి నెగిటివ్ ప్రశ్న ఎదురైయింది. రష్మీని ట్విట్టర్ లో ఫాలో అవుతున్న ఆమె అభిమాని, ఆమెకు బాగా పొగరంటూ ట్వీట్ చేశాడు. ‘నిన్న విమానాశ్రయంలో నేను రష్మిను కలిశా. ఆమె ప్రవర్తన దురుసుగా ఉంది. చాలా పొగరుగా ప్రవర్తించారు. ఇది ఆమె భవిష్యత్తుకు మంచిది కాదు. హ్యాపీ న్యూ ఇయర్’ అని నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై రష్మీ సమాధానం ఇచ్చింది. నాకు 24 గంటలుగా నిద్రలేదు. మూడు విమానాలు మారాను. అందుకే అంత దురుసుగా, పొగరుగా ప్రవర్తించివుంటాను. నా కెరీర్ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడూ బాగుంటాను. హ్యాపీ న్యూ ఇయర్’అని రిట్వీట్ ఇచ్చింది రష్మీ. అయితే ఇందులో ఇప్పుడ హాట్ టాపిక్ ఏంటీ అంటే నాకు 24 గంటలుగా నిద్రలేదు. మూడు విమానాలు మారాను అని చేప్పిన రష్మీ గురించి సోషల్ మీడియాలో ఎక్కడికి వెళ్లిందో అని తెలుసుకునేందుకు తెగ ముచ్చట పడుతున్నారు