Home / 18+ / వైఎస్సార్ రైతుభరోసా నవరత్నం ఆవిర్భవించిందిలా.. రానున్నది రైతురాజ్యం..

వైఎస్సార్ రైతుభరోసా నవరత్నం ఆవిర్భవించిందిలా.. రానున్నది రైతురాజ్యం..

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దచనీయంగా ఉంది.. కడుపు నింపుకోవడానికి పొలాలను అమ్ముకుని కూలీల అవతారమెత్తుతున్నారు రైతులు.. వ్యవసాయ కూలీలు పొట్టచేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలసలలెళ్తున్నారు. ఎలాగోలా పంట పండించినా, కనీస మద్దతుధర దక్కని పరిస్థితి. పాలకులే దళారుల అవతారం ఎత్తడంతో ధరల స్థిరీకరణ కలగా మారింది. రుణమాఫీ సొమ్ము వడ్డీలకు సరిపోక, కొత్తగా అప్పు పుట్టక బ్యాంకర్ల వద్ద రైతులు దొంగలున్న అపవాదే మిగిలింది.

సున్నా, పావలా వడ్డీ జాడ లేక ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులే దిక్కవడంతో అప్పుల కుప్పలే మిగిలిన దయ నీయ పరిస్థితి రైతులది.. ఫలితంగా పూటకో రైతు బలవన్మరణం. ఈ పరిస్థితి మార్చడానికి ప్రతిపక్ష నేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో మొదటిది వైయ‌స్ఆర్ రైతు భరోసా ఆవిర్భావం గురించి తెలుసుకుందాం..

రైతుల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశారు జగన్‌.. వైయ‌స్ఆర్‌ స్వర్ణ యుగాన్ని తెచ్చేందుకు కంకణం కట్టుకున్నారు. తండ్రి రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో ‘వైయ‌స్ఆర్‌ రైతు భరోసా’ అనే పథకాన్ని ప్రకటించారు.అధికారంలోకి రావడానికి అడ్డమైన, అలివికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక రైతులను నట్టేట ముంచింది చంద్రబాబు ప్రభుత్వం. రూ.87,612 కోట్ల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి చివరకు వడ్డీలు కూడా మాఫీ చేయ్పోవడంతో రైతులు డిఫాల్టర్లుగా మిగిలారు. అపరాధ వడ్డీలు కట్టాల్సిన దుస్థితిలోకి వచ్చారు. వాస్తవానికి రైతులు లక్ష రూపాయల లోపు పంట రుణాన్ని సకాలంలో చెల్లించగలిగితే ఎటువంటి వడ్డీ ఉండదు. ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.3 లక్షల లోపు పంట రుణాలను పావలా వడ్డీకి ఇప్పించాలి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆ మేరకు వడ్డీ రాయితీని బ్యాంకులకు చెల్లించక పోవడంతో సున్నా వడ్డీ, పావలా వడ్డీ పథకాలు అమలు కావడం లేదు. ఈ బాధలు పడలేక రైతు ఆత్మహత్య చేసుకోని రోజంటూ లేదు.

2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీలివే..

అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాల మాఫీ చేస్తాం.. 9 గంటల పాటు ఉచిత విద్యుత్, రూ.5వేలకోట్లతో ధరలస్థిరీకరణ నిధి, రైతు వారీగా ఇన్సూరెన్స్‌

 ప్రతి జిల్లాలో ఒక మెగా ఫుడ్‌ పార్క్, ప్రతి మండలంలో ఆగ్రో ప్రాసెసింగ్‌ సెంటర్‌

రైతులకు మేలుచేసేలా పంటబీమా, పాడైపోయిన ట్రాన్స్‌ఫార్మర్లకు 24 గంటల్లో మరమ్మతులు

స్వామినాథన్‌ నివేదిక ఆధారంగా కనీస మద్దతు ధరను ప్రకటిస్తాం.

ప్రత్యేక విత్తన చట్టం తెస్తాం. బీటీ పత్తి విత్తనాలను సబ్సిడీపై అందజేస్తాం,

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించి రుణ సౌకర్యం కల్పిస్తాం,

రైతులకు కాంప్లెక్స్‌ ఫెర్టిలైజర్స్‌ సరఫరా నిమిత్తం రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న చంద్రబాబు.. 
ఈ నాలుగేళ్లుగా ఏం చేసారో చూడండి..

పదవీ కాలం ముగుస్తున్నా పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదు.ఈ విషయమై వేలాది మంది రైతులు వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. 7 గంటలకు కోత వేసి రెండు షిఫ్టులుగా సరఫరా.. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో చంద్రబాబుకే ఎరుక. పంటల బీమాకే దిక్కులేదు.. ఇక రైత్వారీ ఎక్కడో? ప్రభుత్వం ఇచ్చే విత్తనాల కన్నా బహిరంగ మార్కెట్‌లోనే చౌక
దివిటీ పట్టుకుని వెతికినా కనిపించవు
ప్రస్తుతం అమల్లో ఉన్నది ప్రధాన మంత్రి పంటల బీమానే..
గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్డెక్కుతుంటే పోలీసులను పురమాయించి లాఠీలతో కొట్టించారు.

అధికారంలోకి వచ్చాక జగన్ చేయబోయేది ఇదే..
ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు సాయం. రెండవ ఏడాది నుంచి మే నెలలోనే రూ.12,500 చొప్పున నాలుగేళ్ల పాటు అందిస్తారు.

వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌

ప్రతి రైతుకు వడ్డీ లేకుండా, సున్నా వడ్డీ రుణాలు

రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తారు.

పంట వేయడానికి ముందే గిట్టుబాటు ధర ప్రకటన. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి.

రూ.4 వేల కోట్ల (కేంద్ర, రాష్ట్రాలు చెరిసగం భరిస్తాయి)తో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి.

పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి.

తొలి ఏడాది మూతపడ్డ సహకార డెయిరీల పునరుద్ధరణ. ఆ తర్వాత వీటికి పాలు పోసిన రైతులకు లీటరుకు రూ.4 సబ్సిడీ
అనుకోకుండా ఏ రైతు అయినా ఈ లోకాన్ని వీడిపోతే అప్పుల వాళ్లు అతని కుటుంబంపై పడి పీడించకుండా ప్రత్యేక చట్టం. రూ.5 లక్షలు ఆ కుటుంబానికి వారంలోగా అందజేసి తోడుగా ఉంటారు. ఈ రూ.5 లక్షలు ఆ కుటుంబ ఆస్తిగా పరిగణిస్తారు.

రైతుల వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌ నుంచి మినహాయింపు

ఆక్వా రైతులకు కరెంటు చార్జీ యూనిట్‌ రూ.1.50కి తగ్గింపు

(వీటన్నింటి ద్వారా ప్రతి రైతుకు ఏటా రూ.12,500 నుంచి రూ.లక్ష వరకు లబ్ధి కలిగేలా ప్రణాళిక)
పంట నష్టపోయినా దిగులుండదు. ఈ నవరత్నంతో చనిపోవాలనుకుంటున్న రైతుల ముఖాల్లోనూ చిరునవ్వులు చూడబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat