ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుండే నువ్వా- నేనా అనేరీతిలో దూసుకుపోతున్నాయి. ఇక టీడీపీ ఆరో విడత జన్మభూమి-మాఊరు కార్యక్రమంతో ప్రజల్లోకి వెళుతుండగా.. వైసీపీ మాత్రం జగన్ ప్రకటించిన నవరత్నాలు, గడప గడపకి వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే అన్ని నియోజక వర్గాలో భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. అనేక మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా వైసీపీలోకి వచ్చి చేరుతున్నారు. తాజాగా కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజక వర్గంలో వైసీపీ చేరికలు జరిగాయి. పత్తికొండ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు కారం నాగరాజు పందికోన రవి ఆధ్వర్యంలో పత్తికొండ వైసీపీ పార్టీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవమ్మ అధ్యక్షతన వైసీపీలో చేరిన పందికోన గ్రామస్తులు వి. నాగేష్, వి . సుందరప్ప, ఉప్పరి వెంకటేష్, ఉప్పరి శ్రీనివాసులు ,ఉప్పరి రామాంజనేయులు, ఉప్పరి చిన్న సుంకన్న, ఉప్పరి శీను ఉప్పరి రమేష్ బులే,, రంగస్వామి శ్రీనివాసులు, పందుల రాజు ,పి గణేష్, వై.బాలరాజు, బీ రంగస్వామి ,ఏ రాజు తదితరులు వైసీపీ పార్టీలో చేరారు.. రోజుకు రోజుకు పత్తికొండ నియోజక వర్గంలో వైసీపీ బలం పెరుగుతుడడంతో టీడీపీ నేతల గుండెళ్లో రైలు పరుగెతున్నాయి అంటున్నారు వైసీపీ నాయకులు.
