అంతర్జాతీయ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ కొత్త సంవత్సర వేళ పచ్చదనాన్ని పెంచండి అంటూ పచ్చదనంతో కూడిన సైకతశిల్పాన్ని రూపొందించారు.మొక్కలు నాటండి…పచ్చదనాన్ని పెంచండి అంటూ సామాజిక సందేశంతో కూడిన సైకతశిల్పాన్ని సుదర్శన్ పట్నాయక్ బీచ్ లో రూపొందించారు.పర్యావరణ పరిరక్షణకు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటండి అంటూ సుదర్శన్ తన సైకత శిల్పం ద్వార ప్రజలకు సందేశాన్ని అందించారు.దీంతోపాటు బీచ్ లో జగన్నాథుని సైకత శిల్పాన్ని తయారు చేశారు.కొత్త సంవత్సర వేళ పూరి నగర ప్రజలు ఈ సైకత శిల్పాలను చూసేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
