అమరావతి కరకట్టపై అత్యంత వేగంగా వాహనం నడుపుతూ ఓ ద్విచక్ర వహనంపైకి దూసుకెళ్లిన వైనం.. సదరు ద్విచక్ర వాహన దారుడికి తృటిలో తప్పిన పెనుప్రమాదం..ఆ సమయంలో కారులో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సిఈఓ బాబు… ప్రమాదకర కరకట్ట రహదారిలో ఐఏఎస్ అధికారులే అత్యంత వేగంగా వెళ్తూ వాహనదారుల్లో భయాందోళన కలిగిస్తుంటే సామాన్యులు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….ఇదేమని సదరు బాబు వాహన డ్రైవర్ ను బాధితుడు ప్రశ్నించగా మా సార్ వెళ్ళమన్నారు…. మీకు చేతనైనది చేసుకోమంటూ సమాధానం ఇవ్వటం గమనార్హం….
ఇదంతా ఓ బాగమైతే బాబు వాహనం బారినపడి తృటిలో తప్పించుకున్న వ్యక్తి ఓ మీడియా పర్సన్ కావటం శోచనీయం…. కరకట్టపై ఇప్పటికే వాహనాలు అత్యంత వేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నప్పటికి.. వేగ నియంత్రణ చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి కనబరుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి…కరకట్ట మార్గంలోనే ఇంత దూకుడుగా వెళ్తూ మీడియా వ్యక్తికే ప్రాణాపాయం కలిగించిన అధికారి..హైవే పై ఇంకెంత వేగంగా వెళ్తారో…ఇంకెంతమందికి ప్రాణాపాయం తలపెడతారో…..?నిబంధనలు పాటించాల్సిన అధికారులే ఈవిధంగా వ్యవహరిస్తే సామాన్యులు ఎవరికి చెప్పుకోవాలో మరి……