నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. బేగంపేట పైవంతెన మినహా అన్ని పైవంతెనలపై సోమవారం రాత్రి రాకపోకలను నిషేధించనున్నామని ట్రాఫిక్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ద్విచక్రవాహనదారులు కూడా మద్యం మత్తులో వాహనాలను నడుపొద్దని చెప్పుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే చట్టపరమైన కేసులతో పాటు వాహనాల జప్తు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.
నిబంధనలు ఇవే :
- 31న రాత్రి ఒంటి గంట వరకే వేడుకలు జరుపుకోవాలి.
- మద్యం తాగి వాహనాలు నడపొద్దు.
- రహదారులపైకి వచ్చి రాద్దాంతం చేయొద్దు.
- బైకులపై ట్రిపుల్ రైడింగ్.. మితిమీరిన వేగంతో వెళ్లొద్దు.
- వాహనాలతో ప్రమాదకరమైన విన్యాసాలు చేయొద్దు.
- ప్రజలను భయపెట్టే విధంగా శబ్దాలు చేయకూడదు.
- లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు.
- మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు.
- సాధ్యమైనంత వరకు ఇంట్లోనే వేడుకలు జరుపుకోవాలి.
- పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు పార్కింగ్ స్థలాన్ని సమకూర్చుకోవాలి.
- రోడ్లపై వాహనాలను అడ్డదిడ్డంగా పార్క్ చేస్తే కఠిన చర్యలు.
- రెస్టారెంట్ల వద్ద ఆకర్షించడానికి హైవోల్టేజ్ ఎల్‌ఈడీ లైట్స్ పెడితే చర్యలు తప్పవు.
- పబ్‌లు, బార్ల వద్ద వ్యాలెట్ డ్రైవర్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.