Home / 18+ / కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు వ్యవహరిస్తున్నారు

కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు వ్యవహరిస్తున్నారు

శ‌వ రాజ‌కీయాల‌కు మారుపేరు చంద్ర‌బాబని వైసీపీ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. రాజకీయాల్లో చంద్రబాబు వంటి దుర్మార్గమైన, అవకాశవాద నాయకుడు లేరని ఈమాట ప‌క్క రాష్ట్ర ముఖ్యమంత్రి లేరని తెలిపారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీవి బానిస రాజకీయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా కోసం మొదట నుంచి పోరాటం చేస్తూ, ఒకే మాట మీద నిలబడింది వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు. హోదాకు ఎవరు మద్దతిస్తే, వారితో కలవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నోసార్లు చెప్పామన్నారు.

మీలా హోదాకోసం పూటకోమాట మార్చలేదని భూమన నిప్పులు చెరిగారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేని చంద్రబాబు, ఆడలేక మద్దెలఓడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, రాజకీయాల్లో చంద్రబాబు అంత దుర్మార్గమైన, అవకాశవాద రాజకీయ నాయకుడు మరొకరు లేరన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అక్రమంగా దోచుకున్న డబ్బును తెలంగాణ ఎన్నికల్లో మంచినీళ్లలా పారించారని, ఇప్పుడు ఏపీలో కూడా రానున్న ఎన్నికల్లో ఓటుకు మూడు నాలుగు వేలు ఖర్చు పెట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారని భూమన విరుచుకుపడ్డారు. ప్రజలు తమ ఓటుతో టీడీపీకి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వడం ఖాయమన్నారు భూమన..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat