అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు తనలాంటి ఆటగాళ్లు దేశవాళీల్లో బరిలోకి దిగాలని ఇటీవల బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ ధోనీ స్పందించాడు. క్రికెటర్ల వ్యక్తిగత ప్రాధాన్యాలను ఎక్కువగా విమర్శించడం మంచిది కాదని పరోక్షంగా సన్నీకి చురకలంటించాడు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉండాలన్న అభిప్రాయం మంచిదే. దేశవాళీ మ్యాచ్‌ల్లో వ్యక్తిగతంగా పెద్దగా సవాళ్లు ఎదురుకావు. దీనికితోడు బిజీ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి ఏ టోర్నీల్లో ఆడాలని నిర్ణయించుకునే హక్కు ఆటగాళ్లకు ఉంటుంది. ఈ విషయంలో వ్యక్తిగత ప్రాధాన్యాలను విమర్శించొద్దు అని బీసీసీఐ మాజీ బాస్ ఎన్. శ్రీనివాసన్ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ సందర్భంగా ధోనీ పేర్కొన్నాడు.
శ్రీనిని చూసి తాను చాలా నేర్చుకున్నానన్నాడు. తమ ఇద్దరి మధ్య ప్రత్యేకమైన బంధం ఉందన్నాడు. ఫార్మాట్లకు అనుగుణంగా టీమ్‌ఇండియా చేస్తున్న జైత్రయాత్ర చాలా సంతోషాన్ని కలిగిస్తున్నదన్నాడు. మన క్రికెట్ ఎదుగుతున్న తీరు అద్భుతం. టెస్ట్‌ల్లో మన బౌలింగ్ సూపర్బ్‌గా ఉంది. మ్యాచ్ గెలువాలంటే పేసైర్లెనా, స్పిన్నైర్లెనా 20 వికెట్లు తీయాల్సిందే. ఇప్పుడు 20 వికెట్లు తీసే సత్తా మనకు ఉంది. కాబట్టి ప్రతి మ్యాచ్ గెలిచే అవకాశం కూడా మన ముందు ఉన్నది. అయితే బౌలర్లకు గాయాలు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది అని మహీ వ్యాఖ్యానించాడు.