మరో నాలుగు మాసాల్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఏ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు హోరాహోరిగా తలపడనున్నాయి.2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ …ఈ సారి అలాంటి పొరపాట్లు లేకుండా వ్యూహాత్మకంగా ముందుకెల్తోంది.ఎన్నికల సమయం కాబట్టి జంపింగ్‌లు భారీగో జోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా ఇతర పార్టీలనుంచి వైసీపీలోకి వలసలు కొనసాగతున్నాయి.
ఇప్పటికే కర్నూల్ జిల్లాలోని ఆళ్లగడ్డకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా చేసారు.అయితే ఇప్పుడు ఇతను వైసీపీలో చేరే యోచనలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. శనివారం ఆళ్లగడ్డలో అనుచరులతో సమావేశమైన టీడీపీ నేత రాంపుల్లారెడ్డి ఈ మేరకు వారితో సంప్రదింపులు జరిపారని, వైసీపీలో రాజకీయ భవితవ్యంపై చర్చించారని తెలిసింది. తెలుగుదేశం పార్టీలో నీచపు రాజకీయాలు జరుగ్తున్నాయని, అందుకే తాను పార్టీ మారనున్నానని సన్నిహితులతో తేల్చిచెప్పారట రాంపుల్లారెడ్డి. తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం.