ఆళ్లగడ్డలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి రాజీనామా చేశారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మంత్రి భూమా అఖిలప్రియ తీరు ఏమీ బాలేదని, ప్రభుత్వ పథకాల్లో భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదన్నారు.అందుకనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ అవినీతికి మారుపేరుగా మారిందని,నీరు చెట్టు పథకంలో ఆమె భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.ఈ విషయంపై తాను బహిరంగ చర్చకు సిద్ధం అని తెలిపారు. ఇరిగెల బాటలోనే పలువురు మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం.