- 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామన్నారు. గ్రావిటీతో నీళ్లిస్తాం రాసిపెట్టుకోమన్నారు. మూడురోజుల్లో 2018 వెళ్లిపోతోంది.. గుర్తు చేయండి..
- 2018లో ఒలంపిక్స్ అమరావతిలో జరిపిస్తా అన్నాడు. 2018 వెళ్లిపోతోంది. చంద్రబాబుకు కాస్త ఒలంపిక్స్ గురించి గుర్తు చేయండి.
- 2018 కల్లా ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. 2019 వచ్చేస్తోంది వెలిగొండ సాగు తాగునీటి ప్రాజెక్టు సంగతేంటని అడగండి.
- 2018 కల్లా రాజధాని తొలిదశ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. మరి రాజధాని పనులు ఏదశలో ఉన్నాయో చంద్రబాబుకు గుర్తు చేయండి.
- 2018 కల్లా బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా ఏపీ చేస్తానన్నాడు.. కానీ పరిశుభ్రత విషయంలో ఏపీ ఏ ర్యాంకులో ఉందో కనుక్కోండి.
- 2018లో 20లక్షల ఉద్యోగాలని చెప్పిన నారా నాన్నా కొడుకులు. 20లక్షల ఉద్యోగాలు ఎందరికొచ్చాయో తెలుసుకోండి.
- 2018 కల్లా రైతు రుణాలు పూర్తిగా మాఫీ అన్నాడు. ఇంకా మిగులు రుణమాఫీకీ మోదీ సాయం చేయడం లేదంటున్నాడు. 2018 రెండు వెళ్లిపోతోంది కదా.. రైతులంతా ఒకసారి బాబుగారికి కనిపించండి
- 2018 కల్లా బందరు పోర్టు భూసేకరణ పూర్తి చేస్తామన్నారు. బందరు పోర్టు కొత్తకథ ఏమిటని బాబుగారిని అడగండి
ఎప్పుడూ 2018 టార్గెట్ పెడుతూ చంద్రబాబు చెప్పినవి ఒక్కటీ పూర్తి కాలేదు. మళ్లీ ఎన్నికల స్టంటు లో 2022 కథలు బాబు సిద్ధం చేసుకుని వస్తున్నాడు.
2019కి పోలవరం, 2020కి 20లక్షల ఇళ్లు, 2022కు కోటి మందికి ఉద్యోగాలు, 2050కి ఏపీ ప్రపంచస్థాయి దేశంగా ఆవిర్భావం వంటి టైమ్ టార్గెట్లతో చంద్రబాబు ఓట్లు అడగబోతున్నారు.. తెలుగు ప్రజలు ఆలోచించాలి. ఇంతవరకూ బాబు చెప్పిన 2018కి పూర్తికావల్సిన వాటి గురించి రిమైండ్ చేయాలి. ఇప్పటి వరకూ చెప్పిని చేయని బాబును నమ్మమని చెప్పాలి.