తెలుగుదేశం పార్టీ తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేవారు. ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీల అమలు నెరవేర్చాలంటూ పోరాటం చేస్తున్న వైసీపీ పోరును మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమౌతోంది. అందులో భాగంగా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద డిసెంబర్ 27వ తేదీ గురువారం ‘వంచనపై గర్జన’ పేరిట సభ నిర్వహించనుంది. డిసెంబర్ 26వ తేదీ బుధవారం వైసీపీ ఎంపీలు సభా స్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిురెడ్డితో ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేశారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశ వాది..స్వార్థ ప్రయోజానల కోసం ఎంతకైగా తెగిస్తాడు…టీడీపీ తెలుగు దొంగల పార్టీ..డ్రామాల పార్టీ’ అంటూ మండిపడ్డారు. మామను వెన్నుపోటు పొడిచిన బాబు..ప్రజలను కూడా అలాగే చేశారని తెలిపారు. హామీల అమలు..ప్రత్యేక హోదా వైసీపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయకుండా బాబు కాలయాపన చేశారని తెలిపారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, విశాఖ – చెన్నైకారిడార్, దుగ్గరాజుపట్నం కడప స్టీల్ ప్లాంట్..అన్ని అంశాలను అమలు చేసేంత వరకు వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. తెలుగు దొంగల పార్టీ..డ్రామాలు చేస్తూ ప్రజలను విస్మరించారని… బీజేపీతో కాపురం చేసి బాబు…పచ్చి అవకాశ వాది..వెన్నుపోటు దారుడు..స్వార్థ ప్రయోజనాల వెన్నుపోటు పొడుస్తాడన్నారు. బీజేపీతో భాగస్వామ్యంగా ఉంటూ విభజన హామీలు నెరవేర్చలేదన్నారు.