తెలంగాణ ప్రభుత్వం తీపికబురు ఇచ్చింది. ఏప్రిల్ నుంచి పెంచిన ఆసరా పెన్షన్లను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో కొత్త లబ్దిదారుల ఎంపికను పూర్తి చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. దీంతో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో కలెక్టర్లకు మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త వారికి, పెంచే ఆసరా పింఛన్లను 2019, ఏప్రిల్ నుంచి లబ్ధిదారులకు అందజేయాలి. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపికను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఆసరా పెన్షన్లపై రేపు కలెక్టర్లతో సీఎస్ ఎస్ కే జోషి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆసరా పెన్షన్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు కలెక్టర్లకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఓటరు జాబితా ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. 57 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్లు ఇవ్వనున్నారు. ఇప్పటికే 20 లక్షల మంది లబ్ధిదారులను అధికారులను గుర్తించారు.