ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం అవడంపై వివిధ పార్టీల నేతులు వివిధర కాల వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అవగాహన లేకుండా కొందరు…ఉద్దేశపూర్వ విమర్శలతో మరికొందరు విమర్వలు చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ వినోద్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత ప్రధానిని కలవడం ఆనవాయితీ అని వినోద్ వివరించారు. ప్రధాని నరేంద్రమోదీతో ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ సమావేశం సందర్భంగా రాష్ర్టానికి సంబంధించిన అంశాలపై సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చిస్తారని వెల్లడించారు. “ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కొన్ని పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. ఏ రోజు టీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు తెలపలేదు. కాంగ్రెస్, బీజేపీలు గత 60ఏళ్లుగా ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పాలనలో ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు అవకాశం ఇవ్వలేదు. అందుకే ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారు` అని ఆయన స్పష్టం చేశారు.