ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసిఆర్ నేడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతున్నారు. సాయంత్రం 4 గంటలకు అపాయింట్ మెంట్ ఫిక్స్ అయ్యింది. రెండోసారి సీఎం అయిన తర్వాత తొలిసారి కలుస్తున్న కేసిఆర్, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపైనా చర్చించే అవకాశముంది.
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో సమావేశమైన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆయన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో జాతీయ రాజకీయాలపై చర్చించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని కేసీఆర్… ఫెడరర్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు ప్రారంభమయ్యాయి.. ఇక ముందు కూడా కొనసాగుతూనే ఉంటాయన్నారు. త్వరలోనే ‘ఫెడరల్ ఫ్రంట్’ పూర్తి స్థాయి ప్రణాళికతో మీ ముందుకొస్తామని తెలిపారు. రాష్ట్ర సమస్యలపైపై ప్రధానితో సమావేశం కానున్నారు.