ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ వైఎస్ జగన్ ను ప్రముఖ నటుడు భానూ చందర్ మెచ్చుకున్నారు.చరిత్రలో ఎన్నడూ లేని విదంగా జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఎన్.టి.ఆర్.తర్వాత ఇంత ప్రజాదరణ చూరగొన్న నేతను తాను చూడలేదని ఆయన అన్నారు. జగన్ ను ఆయన కలిసి వచ్చారు. సంఘీ భావం ప్రకటించారు.ఆ తర్వాత విశఖ జిల్లాలో పిల్మ్ ఫెడరేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీలో చేరానని భానుచందర్ అన్నారు. ‘‘రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నా. వైసీపీ అధినేత పాదయాత్రలో పాల్గొన్నాను. జగన్ ఎంతో ఓర్పు, ఔదార్యం కలిగిన నాయకుడు. జగన్‌ను చూసినప్పుడు నాకు బుద్ధుడి రూపం కళ్ల ముందు కదలాడిందని భానుచందర్ పేర్కొన్నారు.