ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సింగపూర్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో సింగపూర్‌లో పర్యటించనున్నారు. సింగపూర్ ఆరో అధ్యక్షుడు ఎస్ఆర్ నాథన్ స్మారకార్థం ఆ దేశ ప్రభుత్వం అందించే ఎస్.ఆర్ నాథన్ ఫెలోషిప్‌ను లోకేశ్ అందుకోనున్నారు. ఈ మేరకు ఫెలోషిప్‌ను అందుకోవాలని మంత్రి లోకేశ్‌కు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్ బాలకృష్ణన్ ఆహ్వానం పంపారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు సింగపూర్ మంత్రులతోనూ లోకేశ్ సమావేశం కానున్నారు.
