మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రానున్న పంచాయితీ,పార్లమెంట్ ఎన్నికల్లో కుడా ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకు పోతుంది.ఈ నేపధ్యంలోనే జాతీయ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ ఒక సర్వే చేసింది.ఏపీలో ఈ డిసెంబర్ నెలలో ఎన్నికలు జరిగితే ఏపీలోని మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ 14 చోట్ల విజయం సాధిస్తుందని .. మిగిలిన 11 స్థానాల్లో టీడీపీ, కాంగ్రెస్ కూటమి దక్కించుకుంటుందని తెలిపింది . ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రజా తీర్పు వైసీపీకి అనుకూలంగా ఉండిందని, అయితే టీడీపీ, కాంగ్రెస్ జట్టుకట్టడంతో పరిస్థితి మారిపోయిందని రిపబ్లిక్ టీవీ సర్వే పేర్కొంది.
ఇక తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకు గాను అధికార టీఆర్ఎస్ పార్టీకి 16 సీట్లు సాధించి మరోసారి దుందుభి మొగిస్తుందని తెలిపింది ..మిగిలిన ఒక స్థానం మజ్లిస్ పార్టీకి దక్కుతుందని తెలిపింది.మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే.. 542 సీట్లకుగాను బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి 247, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీకి 171 సీట్లు వస్తాయని రిపబ్లిక్ టీవీ పేర్కొంది.