ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కేఏ పాల్ మరోమారు తనదైన శైలిలో కలకలం సృష్టించే వ్యాఖ్యాలు చేశారు. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అన్నింటిలో మేమే నెంబర్ 1 అని చంద్రబాబు అంటుంటారని.. క్రైమ్‌లో నెంబర్ వన్నా? అని పాల్ ఎద్దేవా చేశారు. ఏపీలో రోడ్లు లేవు, హాస్పిటళ్లు లేవు, ప్రజలకు తిండి లేదు అని పాల్ వాపోయారు. ఏపీలో ఎవరికీ రక్షణ లేదని చిటపటలాడారు. ప్రతిపక్ష నేతలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రక్షణ లేదని స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణే చెప్పారని పాల్ గుర్తు చేశారు.
ఈ సందర్భంగా దేశ రాజకీయాలపైనా పాల్ కామెంట్లు చేశారు. సేవ్ సెకులర్ ఇండియా అనేది అందరి స్లోగన్ అన్నారు. థర్డ్ ఫ్రంట్‌లోని పెద్ద పెద్ద నాయకులు తనతో టచ్‌లో ఉన్నారని, తనను ప్రత్యేకంగా కలుస్తున్నారని పాల్ చెప్పడం గమనార్హం. ఇప్పటికే 6 పెద్ద పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించానని పాల్ చెప్పారు.