ఏపీ ప్రతిపక్ష నేత.వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు పంచాయతీ బోర్డు మెంబర్‌కున్న అనుభవం కూడా లేదని ఎద్దేవా చేశారు. జగన్‌కు ఎకనామిక్స్, సోషియాలజీ తెలియదని అన్నారు. అన్నీ ఇచ్చేస్తామని ఆయన కబుర్లు చెబుతున్నారని, ఇలాంటి అనుభవశూన్యులతో భవిష్యత్‌కు ప్రమాదమని చంద్రబాబు అన్నారు. మంగళవారం సంక్షేమ రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు. సాధించిన ప్రగతిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ కన్నా… అన్న క్యాంటీన్లలోనే శుభ్రత, నాణ్యత ఎక్కువని చెప్పారు. ఇంత తక్కువ ధరకు రుచికరమైన భోజనం అందిస్తున్న… క్యాంటీన్లు ఎక్కడున్నాయో చెప్పాలన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో కొంత రాజధానికి ఖర్చు చేస్తే… సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేమని సీఎం అన్నారు.
