వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 330 రోజులకు చేరుకుంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆయన చేస్తున్న పాదయాత్ర ఒక సంవత్సరం పాటు జరగడంతో ఇప్పుడు యావత్ దేశ రాజకీయాలను జగన్ తన వైపునకు తిప్పుకున్నారు. ఈ పాదయాత్రలో ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ 2019 ఎన్నికల్లో గెలుపుకోసం వ్యూహాలు రచయిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయా పార్టీలకు చెందిన బలమైన నేతల్ని తనవైపు తిప్పుకున్నాడు. తాజా సమచారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి దంపతులు త్వరలో వైసీపీలో చేరబోతున్నారని సమచారం. ఈమేరకు పనబాక లక్ష్మి ప్రకటించినట్టు ప్రచారం జరుగుతుంది. గుంటూరు, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పనబాక వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారట..
గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష్మి కేంద్రమంత్రిగా పనిచేశారు. వైఎస్ తో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ పొత్తు కారణంతో ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పలువురు కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. ఇక సాధారణ ఎన్నికలకు ముందు వైసీపీలో పలువురు కీలక నేతల జంపింగులు జోరందుకోవడంతో తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడ్డరంట. అంతేకాదు అభ్యర్థుల ఎంపికలో జగన్ ఈక్వేషన్లు చూసి టీడీపీ వాళ్ల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. వైసీపీకి వస్తున్న మైలేజ్ చూసి రాజకీయంగా సంధి కాలంలో ఉన్న సీనియర్లు సైతం వైసీపీలోకి జంప్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.