ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచే 1994 లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు అసెంబ్లీకి ఎన్నికయ్యారని, కాని ఆయనకు 1995 లో వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. పాదయాత్రలో బాగాంగ టెక్కలి నియోజక వర్గంలో పర్చటిస్తున్న జగన్ టెక్కలిలో జరిగిన భారీ బహిరంగ సబలో ఈ వాఖ్యలు అన్నారు. ఇంకా ఎమ్మానారంటే ఎన్.టి.రామారావు గారికే కాదు చంద్రబాబు తెలుగు ప్రజలందరికి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని ఆయన అన్నారు.టెక్కలి ప్రజలు తనతో చెబుతున్నారని, ఇక్కడి మంత్రి అచ్చెన్నాయుడు తాటిచెట్టు అంత ఎదిగారు కాని,ఈతకాయంత కూడా మేలు చేయడం లేదని చెబుతున్నారని ఆయన అన్నారు.ఆముదాల వలస,నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాలలో ఇసుక దందా అంతా అచ్చెన్నాయుడిదేనని ప్రజలు చెబుతున్నారని ఆయన అన్నారు. చినబాబు కు కూడా ఈ దందాలో వాటా ఉందని ఆయన అన్నారు. అచ్చెన్నాయుడు సోదరుడు ప్రసాద్ కూడా ప్రజలను దోచుకుంటున్నారని చెబుతున్నారని ఆయన అన్నారు.ఐదు కోట్ల ఆర్టిసి స్థలాన్ని తన బినామీకి ఇప్పించుకున్నారని ప్రజలు చెప్పారని జగన్ అన్నారు.కమిసన్ లకు కక్కుర్తి పడే మంత్రిగా అచ్చెన్నాయుడును ప్రజలు చెబతున్నారని,పోస్టులు అమ్ముకుంటున్నారని ఆయన అన్నారు..ఇక్కడి కోటబొమ్మాళి కి చెందిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ అబిమానుల పెన్షన్ రద్దు చేస్తే వారు కోర్టు కు వెళ్లి తెచ్చుకోవల్సివచ్చిందని అన్నారు. అచ్చెన్నాయుడు అరాచకాలకు పాల్పడుతున్నారని,సొంత గ్రామం నిమ్మాడలో ఇరవై కుటుంబాలను సాంఘీక బహిష్కరణ చేశారని ఆయన అన్నారు.
