ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏర్పాటైన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కేటాయించింది.భారతదేశవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటైన 29 పార్టీలకు ఈసీ వివిధ గుర్తులను కేటాయించింది.ఈ క్రమంలోనే .. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయిస్తూ శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది.రానున్న సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఈ గుర్తు మీద పోటీ చేస్తారు. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నక్రమంలో… అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఇదే గుర్తు వర్తిస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది .