హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో డాక్టర్లు చేసిన చర్య సంచలనంగా మారింది. హుక్కా పీలుస్తూ మధ్యం సేవిస్తూ.. మహిళలు అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తూ సాగే రేవ్ పార్టీ నిర్వహించిన డాక్టర్లు ఈ సందర్భంగా జుగుప్సాకరంగా వ్యవహరించారు. డాక్టర్లు రేవ్ పార్టీ నిర్వహించడమే కాకుండా….అందులో పాల్గొనే యువతులకు ముందుగానే ఎయిడ్స్ టెస్ట్ చేయించడం సంచలనంగా మారి వార్తల్లోకి ఎక్కింది.
మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట మండలం సెలబ్రిటీ రిసార్టులో రేవ్ పార్టీ నిర్వంచారు. రేవ్‌పార్టీ సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు దానిని భగ్నం చేసి భారీగా మద్యం, కండోమ్ పాకెట్లతో పాటు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించడానికి వాడే మెడికల్ కిట్లు కూడా సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్‌కు చెందిన డాక్టర్లు నిర్వహించిన రేవ్‌పార్టీగా గుర్తించారు. ఈ రేవ్ పార్టీ చేసుకోటానికి ముందు డాక్టర్లు యువతులకు హెచ్ఐవీ టెస్టులు చేసినట్లు తెలిసింది. 11 మంది డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని వారిలోని నలుగురు యువతులను పోలీసులు రెస్కూ హోంకు తరలించారు.
Post Views: 213