తాతకు తగ్గ మనమడు….తండ్రి గొప్ప మనసుకు తగిన వారసుడు అనే పేరును తెలంగాణ సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు సొంతం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి దివ్యాంగుడిగా మారి 12 ఏండ్లుగా మంచానికే పరిమితమైన వ్యక్తికి సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు చేయూతనందించారు. తద్వారా చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకున్నారు.
భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాజీవ్‌నగర్‌లో నివాసముంటున్న నూకసాని శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. మంచానికే పరిమితమైన ఇతను కొంతకాలంగా ట్రైసైకిల్‌పై తిరుగుతున్నాడు. ఈ క్రమంలో వెన్నుపూస గాయం మరింత పెరిగి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు కేసీఆర్ దేవుడు.. ఆయన పింఛ న్ ఇవ్వకున్నా ఫర్వాలేదు.. ఆకలి తీర్చేందుకు దివ్యాంగులకు ఇప్పుడిచ్చే మొత్తం సరిపోతుంది. అయినా మళ్లీ ఆయనే అధికారంలోకి రావాలి అని ఓ యూట్యూబ్ చానల్‌లో శ్రీనివాసరావు మాట్లాడారు. ఆ మాటలకు సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు చలించిపోయారు. శ్రీనివాసరావు చిరునామాను గుర్తించి వెంటనే అతణ్ణి భద్రాచలం ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్యమందించేలా ఏర్పాట్లు చేశారు. అవసరమైతే హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందేలా సాయపడతానని హామీ ఇచ్చి ఆ కుటుంబంలో ఎంతో ధైర్యాన్ని నింపారు.
నూకసాని శ్రీనివాసరావు భార్య అమ్మాజీ ఈ సందర్భంగా మాట్లాడుతూ హిమాన్షు భరోసా కల్పించారని తెలిపారు. “పన్నెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో నా భర్తకు వెన్నుపూస విరిగింది. రూ.3లక్షలు ఖర్చుచేసినా ఆరోగ్యం మెరుగుపడలేదు. సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు నా భర్తతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్యం అందిస్తానని హామీ ఇవ్వడం ఆనందంగా ఉంది. హిమాన్షు చొరవతో నా భర్త కోలుకుంటాడనే నమ్మకం కలిగింది.“ అని తన సంతోషం వ్యక్తం చేశారు.
Post Views: 288