Home / ANDHRAPRADESH / దేశ చరిత్రలో ఏ నాయకుడికీ దక్కని అరుదైన అవకాశం.. ఆనందంలో వైసీపీ అభిమానులు

దేశ చరిత్రలో ఏ నాయకుడికీ దక్కని అరుదైన అవకాశం.. ఆనందంలో వైసీపీ అభిమానులు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో ఓ వ్యక్తి చేసిన పని వైఎస్ కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన రోజుల్ని పధిలంగా దాచి ఉంచారు.. అదికూడా ఎంతో వినూత్నంగా.. చిలకలూరిపేటకు చెందిన భాస్కర్‌ రెడ్డి మూడేళ్ల కిందట బెంగుళూరు వెళ్లారు. అక్కడ ఒక ఎగ్జిబిషన్‌లో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్టాల్‌ లో వాజ్‌పేయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాల తేదీలున్నాయట.. వాటిని అమ్మకానికి కూడా పెట్టారట.. అక్కడ మనకు కావాల్సిన పది రూపాయల నోటు కావాలంటే మూడు వందలివ్వాలట.. దీంతో భాస్కరరెడ్డి తనకిష్టమైన వైఎస్‌ఆర్‌ జీవితంలో ముఖ్య ఘట్టాల తేదీలు సేకరించాలనుకున్నారట. వెంటనే రాజశేఖరరెడ్డి జీవితంలోని ముఖ్యమైన తేదీలను సేకరించారు.. వైఎస్‌ఆర్‌ పుట్టినరోజు, పెళ్లిరోజు, జగన్‌ పుట్టినరోజు, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజు, పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజు, పాదయాత్ర తేదీలు, రెండు దఫాలు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తేదీలు, షష్టిపూర్తి తేదీ, చనిపోయిన రోజును కూడా లిస్ట్‌ రాసుకుని ఆ నోట్లను తెప్పించుకున్నారు.. ప్రతి తేదీకి ఒక్కరూపాయి, ఐదు, పది, ఇరవై రూపాయల నోట్లను సేకరించారు. ఇందుకోసం వైఎస్ కుటుంబం కోసం ఎంతో అధ్యయనం చేసారు. ఎన్నో వివరాలు సేకరించారు. వాటన్నింటినీ తేదీల ఆధారంగా పుస్తకంలో రాసుకున్నారు.

వైఎస్ సొంతూరు బలపనూరుకెళ్లి ఆచన మూడు ఇళ్లనూ చూశారు. సమాధుల దగ్గరకెళ్లి వైఎస్‌ఆర్‌ తాతగారు వెంకట రెడ్డి, తండ్రి రాజారెడ్డి, తల్లి జయమ్మ పుట్టిన తేదీలు, పోయిన తేదీలు, ఇతర బంధువులు చిన కొండారెడ్డి, పురుషోత్తమ రెడ్డి, రత్నమ్మల వివరాలు కూడా సేకరించారు. ఆయన రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు ఏయే సంవత్సరాల్లో జరిగాయో తెలుసుకుని, ఆయన ఏ ఏడాది గెలిచిందీ తెలుసుకున్న తర్వాత లైబ్రరీలకెళ్లి పాత పేపర్లు వెతికి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తేదీని (1978, మార్చి 15వ తేదీ) పట్టుకున్నారు. ఆయన ప్రపంచ వ్యవసాయ సదస్సులో ప్రసంగించిన తేదీ, ముఖ్యమంత్రిగా ప్రారంభించిన స్కీముల తేదీలతో సహా ప్రతీ ఘట్టాన్ని ఫైల్‌ చేసారు. తన దగ్గరున్న కరెన్సీ నోట్ల ఆల్బమ్‌ తిరగేస్తే ఆ మహానుభావుడి జీవితం మొత్తం కళ్లకు కడుతుందట.. అలాగే వైఎస్‌ఆర్‌ రాజమండ్రి రోడ్డు కమ్‌ రైలు వంతెన మీద నడిచిన తేదీ, షర్మిల నడిచిన తేదీ, జగన్‌మోహన్‌ రెడ్డి నడిచిన తేదీల కరెన్సీ నోట్లు, షర్మిల పాదయాత్ర ప్రారంభ తేదీ, ముగింపు తేదీల కరెన్సీ నోట్లు దాచారు. జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర అయితే యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ప్రతి వంద కిలోమీటర్ల మైలు రాయిని చేరిన తేదీలతోపాటు ప్రతిపక్ష నాయకుడిగా ఇన్నేళ్లలో ఆయన చేసిన ఓదార్పు యాత్ర, లక్ష్య దీక్ష, జల దీక్ష, జన దీక్ష, హరితయాత్ర, ఫీజు పోరు, రైతు దీక్ష, సాగు పోరు, మహా ధర్నా, కరెంటు పోరు, చేనేత దీక్ష, విద్యుత్‌ ధర్నా, విభజన వ్యతిరేక దీక్ష, బాబు వైఫల్యాల ధర్నా, సమైక్యాంధ్ర దీక్ష, సిఆర్‌డిఎ ధర్నా, పొగాకు రైతుల కోసం, ప్రత్యేక హోదా కోసం దీక్ష, కరువు ధర్నా… ఇలా ప్రతి ఘట్టాన్ని నోట్‌ చేసారు. తనకు ఓపిక ఉన్నంత కాలం ఇలా సేకరిస్తూనే ఉంటానని, వీటన్నింటితో వైఎస్‌ఆర్‌ వర్ధంతి రోజున ప్రదర్శన పెట్టాలనేది తన కోరికగా చెప్తున్నారు భాస్కర్‌ రెడ్డి. ఒక్క పది రూపాయల నోటుకు మూడు వందలు చొప్పున ఇన్ని నోట్లు సేకరించడానికి భాస్కర్‌ రెడ్డి ఖర్చు చేసిన మొత్తం మూడు లక్షల వరకు ఉంటుంది. ఆయన మాత్రం వైఎస్సార్ మీద నాకున్న అభిమానానికి వెల కట్టలేను. ఆ ప్రేమ ఎంతో అమూల్యమైనది అంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat