వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారుజ జగన్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్ లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. బంజారాహిల్స్ లోని వైఎస్సార్ సర్కిల్ లో గురువారం అర్ధరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి యువత సంబరాలు చేసుకున్నారు. వందలాదిగా తరలివచ్చిన యువకులు జై జగన్. ఇండియన్ పొలిటికల్ సూపర్‌స్టార్ అంటూ భారీ నినాదాలు చేశారు.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఐరాల మండల కన్వీనర్ బుజ్జిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరులోని అమ్మఒడి ఆశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి అల్పాహార వితరణ చేశారు. అలాగే శ్రీకాకుళంలోని దుర్గా మహాలక్ష్మి దేవాలయంలో వారాహి యాగం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని కాళ్ల ఆస్పత్రిలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సంధర్భంగా రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఉండి నియోజకవర్గం సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు కేక్ కట్ చేశారు. ఎన్నార్పీ అగ్రహారం యువత భారీ కేక్ కట్ చేసి రోడ్లు మొత్తం నిండిపోయేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. బాణసంచా వెలుగులతో జగన్నినాదాలు చేసారు. ముత్యం మౌళి కుమార్, రాహుల్, జయరాజులతో పాటు సుమారు 50మంది యువకులు అగ్ర సినీ హీరోలకు తీసిపోని విధంగా జగన్ పుట్టినరోజు నిర్వహించారు. పీవీఎల్ నరసింహ రాజు ఆద్వర్యంలో యువత జగన్ బాటలో నడిచేందుకు ముందుకు వస్తున్నారు.
పీవీఎల్ అర్ధరాత్రి 12 గంటల నుంచే జననేత జగన్ పుట్టినరోజు వేడుకలను పర్యవేక్షించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి కారుమూరి నాగేశ్వరావు కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్ తుదపరి పుట్టినరోజు ముఖ్యమంత్రి హోదాలో జరుపుకొంటారని పీవీఎల్ విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సీఎం కావాలన్నదే ఆంధ్రా ప్రజల అభిలాష అని పీవీఎల్ వ్యాఖ్యానించారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా పీవీఎల్ ఆద్వర్యంలో భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే నరసాపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో, తణుకులో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్‌రాజు, నియోజకవర్గ యూత్ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకొల్లులోని గాంధీ బొమ్మల సెంటర్లో వైస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.