తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 23న ఏపీకి వెళ్లనున్నట్లు సమచారం. ఆయన విశాఖ శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకునేందుకు కేసీఆర్ పయనం అవుతున్నట్లు తెలుస్తుంది.ఎన్నికల సమయంలో కేసీఆర్‌తో రాజసూయ యాగాన్ని స్వరూపానందేంద్ర చేయించారు. ఇప్పుడు తిరిగి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో కేసీఆర్ విశాఖ శారదా పీఠానికి వస్తున్నారు. స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్న తర్వాత విశాఖ నుంచి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి మలి విడత చర్చలకు సిఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఆదివారం ఆయన భువనేశ్వర్ వెళ్లి, అక్కడ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటన సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 23న విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి భువనేశ్వర్ చేరుకుని సిఎం నవీన్ పట్నాయక్ తో సమావేశమవుతారు. అనంతరం ఢిల్లీకి చేరుకుంటారు. 24న యూపీ మాజీ సీఎం అఖిలేష్, బీఎస్పీ అధినేత్రి మాయవతితో సమావేశం అవుతారు.
Tags andrapradesh CM KCR federal front