తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట ప్రజలు అంటే ప్రేమా…అభిమానం…ఒక కుటుంబం అని హరీష్ రావు గారు నిరంతరం తన మాటల్లో విన్నాం..వారి సతీమణి నిదర్శనం అని చూపారు.. ఎమ్మెల్యే హరీష్ రావు గారు,వారి సతీ మణి శ్రీనిత గారు.. ప్రతి ఏటా సిద్దిపేట లో హాస్టల్ లలో చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేస్తారు..అదే మాదిరిగా ఈ ఏటా కూడా అలానే దుప్పట్ల పంపిణీ చేస్తారు..సిద్దిపేట లో అనాథ పిల్లల వసతి గృహం ఉంది అని తెలుసుకున్న శ్రీనిత గారు..శుక్రవారం నాడు సిద్దిపేట బాలసధనం లో ఉండే అనాథ పిల్లలకు తన స్వంత ఖర్చులతో పిల్లలకు దుస్తువులు , దుప్పట్లు , స్వెటర్లు, చెప్పులు పంపిణీ చేశారు…
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనాథ పిల్లలకు సేవ చేయడం ఇంత కన్నా గొప్ప ఆనందం ఏముంది అని.. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు.. పిల్లలను చూస్తే దుఃఖం.. మరో వైపు సంతోషం రెండు ఉన్నాయ్.. తల్లి తండ్రులు లేని పిల్లలు..వారిలో చదవాలి అనే తపన తో అనాథలుగా ఇక్కడ చదువుతున్నరు.. వారు బాగా చదవాలి ఏ సహాయం అయిన అండగా ఉంటామని ఆమె అన్నారు… అదే విదంగా మెజార్టీ లో సిద్దిపేట ప్రజలు చూపించిన అభిమానం మరువ లేనిది..
సిద్దిపేట ప్రజల సేవలో నిరంతరం మేము ఉంటామని అన్నారు… ఈ సందర్భంగా అనాథ పిల్లలతో కలిసి సహపంక్తి బోజనం చేశారు…హరిశ్ రావు గారే కాదు వారి భార్య కూడా మన మనత్వాన్ని చాటుకొని ఆదర్శంగా నిలిచింది.. పిల్లలతో ఆత్మీయంగా గడిపారు..