ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రచారం పిచ్చి హైటెక్స్ దాటిపోయి పీక్స్ స్టేజ్ కు వెళ్లిపోతోంది. అలా వెళ్లిపోయినప్పుడు కొన్నిసార్లు ఉపద్రవం జరుగుతోంది. చంద్రబాబుకి పని మీద కంటే ప్రచారం మీద యావ ఎక్కువైపోతోంది. ఎక్కడైనా ఓ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు కవర్ చేయడం సాధారణమే కానీ ఇక్కడ చంద్రబాబు మాత్రమే కవరేజీ కోసమే పనిచేస్తుండడం ఎన్నో సమస్యలకు కారణం అవుతోంది. మొత్తం కంట్రీ వైడ్ గా రాష్ట్రం పరువు నవ్వుల పాలౌతోంది. తాజాగా విపత్తుల్లోనూ చంద్రబాబు తన విద్వత్తూ, ప్రచార గమ్మత్తులకు పులిస్టాప్ పెట్టట్లేదు. చంద్రబాబు అడుగుపెట్టినప్పుడు విశాఖలో వచ్చిన హుద్ హుద్ నుంచి తాజాగా వచ్చిన పెథాయ్ వరకూ ఏ తుఫాను వచ్చినా చంద్రబాబు దాన్నికూడా రాజకీయ మైలేజీ కోసం వాడుకోవడం ఎంతో విడ్డూరంగా కనిపిస్తోంది. ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ తుఫాన్లను టెక్నాలజీతో అడ్డుకున్నామని, సముద్రాన్ని కంట్రోల్ చేస్తానని చెప్పుకున్నారు. తన ప్రచార యావ కోసం పెథాయ్ తుఫాను రెస్క్యూ ఆపరేషన్ పనులను డాక్యుమెంటరీ తీయించారు. అంటే తుఫాను బాధితులను రక్షించడం, వారికి పునరావాసం, చంద్రబాబు టెలీకాన్ఫరెన్సులు, బాధితుల పరామర్శలు, పులిహోర పొట్లాల పంపిణీ వంటివి రికార్డు చేయించారు. తుఫానుకు ముందు తీసుకోవాల్సిన చర్యలకంటే తుఫాను తర్వాత తాను చేసేన పనులకు ప్రచారం చేసుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. గతంలో ఇదే డాక్యుమెంటరీ యావతో పుష్కరాల్లో పదులమంది ప్రాణాలను గాల్లో కలిపిన చంద్రబాబు ఇప్పుడు బాధితుల బాధలు తీర్చడం కంటే వాటిని వీడియోలు తీయించడానికే ప్రాధాన్యమిస్తున్నారు. అంత జరిగినా ఇప్పటికీ చంద్రబాబు ప్రచారార్భాటం కోసం పాకులాడుతున్నారు. అబద్ధాలైనా సరే సొంత ప్రచార సంస్థల ద్వారా పదే పదే ప్రచారం చేయించుకుని పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు ఆలోచించడంలో కొంతైనా ప్రజలకు మేలు చేస్తే వారే తనను గుండెల్లో పెట్టుకుంటారని మాత్రం గ్రహించుకోలేకపోతున్నారు.
