ఏపీలో ఎక్కడ చూసినా ఒకే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుకు మిగిలిన రెండు సీట్ల గురించే చర్చించుకుంటున్నారు. దారుణ ఓటమి తప్పరదని తెలిసీ నందమూరి కుటుంబంలోని వారసులను బలిపశువులను చేయడం బాబు వ్యూహంలో భాగమేనట.ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ పేరును అన్న అంటూ స్మరించే చంద్రబాబు తర్వాత ఆ పేరుకు గ్రహణం పట్టించేస్తుంటాడు. టీడీపీని కబ్జా చేసుకున్ననాటి నుంచే నందమూరి వారసులను పార్టీకి దూరం పెట్టాడు. బాలకృష్ణ, హరికృష్ణ, దగ్గుబాటి ఇలా ఆ కుటుంబానికి సంబంధించిన అందరినీ చీకట్లోకి నెట్టేశాడు.
అనూహ్యంగా అధికారానికి దూరమవడంతో మళ్లీ నందమూరి వంశం పేరు వాడక తప్పలేదు. ఆ కుటుంబీకులను తనకు నచ్చినట్టు చెప్పుచేతల్లో ఉంచుకునే ఎత్తుగడలతో చంద్రబాబు జిత్తులన్నీ చూపించాడు. బాలకృష్ణ కుమార్తెతో లోకేశ్ వివాహం జరిపించి టీడీపీకి వారసుడిగా లోకేష్ తప్ప మరొకరి పేరు లేకుండా చేసాడు. ఇక హరికృష్ణ వైపు నుంచి బలంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను కూడా పార్టీ ప్రచారానికి మాత్రమే పరిమితం చేసాడు. ఇలా నందమూరి కుటుంబం నుంచి గట్టి పోటీ ఇచ్చే నాయకుడే లేకుండా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు.
తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు తన కుళ్లు, కుతంత్రాలను మరోసారి ప్రయోగించాడు. హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ ను పోటీ చేయమని కోరగా ఆయన నిరాకరించాడు. జూనియర్ ప్రచారానికి కూడా రానని చెప్పారట.. దాంతో చంద్రబాబు చూపు సుహాసినివైపు మళ్లింది. సుహాసిని మావగారు గతంలో టీడీపీ ఎంపిగా ఉమ్మడి రాష్ట్రంలో తన ఉనికి చాటుకున్న వ్యక్తే. ఆ విధంగా సుహాసిని రాజకీయరంగ ప్రవేశాన్ని తప్పనిసరి చేసారు. నిజమైన సర్వే ఫలితాలు, సుహాసిని వంటివారికి అనుకూలత ఉండదన్న వాస్తవం చంద్రబాబుకు తెలియక కాదు. ఒకే కుటుంబానికి చెందిన వారికి చిచ్చుపెట్టి, భవిష్యత్తులో పోటీకి రాకుండా నిలువరించడమే చంద్రబాబు వ్యూహం.
అందరూ అనుకున్నట్టుగానే కూకట్ పల్లిలో సుహాసినికి ఓటమి ఎదురైంది. సరిగ్గా మాట్లాడటం రాని, రాజకీయ అనుభవం లేని మహిళను చంద్రబాబు బలవంతంగా ఎన్నికల బరిలోకి లాగి బలిపశువును చేసారని టీడీపీలో ఎంతోమంది మధనపడుతున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణాలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారానికే కాకుండా సుహాసిని ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉండిపోయారు. గెలవాలని ఆశిస్తున్నాం అంటూ ప్రకటన ఇచ్చారంతే గత ఎన్నికల్లో జూనియర్ ను ప్రచారం తర్వాత చంద్రబాబు అవమానించిన తీరు వారికి కనువిప్పు కలిగించిందట.. చాలా సందర్భాల్లో తారక్ సినిమాలకు థియేటర్లు లేకుండా చేయడం, సమస్యలు సృష్టించడం లాంటివి నందమూరి అభిమానులకూ కచ్చితంగా ఆగ్ర హం కలిగించాయి.
తండ్రి హరికృష్ణలాగే కొడుకులూ చంద్రబాబు రాజకీయ ఎదుగుదలకు నిచ్చెనలై ఉపయోగపడుతున్నారంటూ వస్తున్న విమర్శలకు పులిస్టాప్ పెట్టేందుకే వీరు తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్నారట.. తమ తండ్రి, బాబాయి, మావయ్యలు చంద్రబాబు దగ్గర మోసపోయినట్టుగా తాము కాకూడదని ఎన్టీఆర్ మూడోతరం వారసులు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం నందమూరి వారసులు మాత్రం క్లారిటీతో ఉన్నారు. ఇది ఒక విధంగా నిజమైన తెలుగుదేశం కార్యకర్తలకు ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్తే .. కారణం అన్నగారిని వెన్నుపోటు పొడిచినవారిని వాళ్లు ఇప్పటికీ మరువరు కాబట్టి. అలాగే హరికృష్ణ పార్ధీవ దేహం వద్దకు వచ్చి కూడా చంద్రబాబు రాజకీయాలు చేయడానికి ప్రయత్నించిన విషయం ఎన్టీఆర్ కు తీవ్ర ఆగ్రహం కలిగించిందట.