వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కు తుని రూరల్ పోలీసులు నోటీసులు అందజేశారు. 2015 జులైలో ఇసుక రవాణా అడ్డుకోవడంతో ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదుచేశారు. రాజాపై అక్రమ కేసు నమోదు వెనుక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుల ఒత్తిడి ఉందని, ఘటన జరిగిన మూడేళ్లు గడిచిన తర్వాత ఎన్నికలు సమీపిస్తుండటంతో మంత్రి యనమల సోదరులు వేధింపులు మొదలుపెట్టారు. ఈ మేరకు బుధవారం వైసీపీ కార్యాలయానికి వచ్చిన పోలీసులు రాజాకు నోటీసులు ఇచ్చారు. క్రైమ్ పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు తుని పోలీసులు తెలిపారు. కోర్టు పిలిచినపుడు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు.
Tags ap brothers cases DADISETTI RAJA east godavari sand tdp TUNI yanamala ramakrishnudu ysrcp