తనకు రాజకీయంగా మేలు జరుగుతుందంటే చంద్రబాబు ఏదైనా చేస్తారు. నాలుకను ఎటు కావాలంటే అటు తిప్పడమే కాకుండా తనను, తన పార్టీని తిప్పుతాడు. ప్రత్యేక హోదా విషయంలో కూడా రాజకీయంగాను, వ్యక్తిగతంగానూ మేలు చేస్తుందని భావించినంతకాలం బిజెపితో అంటకాగుతూ హోదా అవసరం లేదని వాదించి, హోదా వల్ల ప్రయోజనాలేమీ లేవని డాంబికాలు పలికారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రత్యేక హోదా పై ఉద్యమాలు, ఆందోళనలతో నిరంతరం పోరాడుతూ ప్రజల్లో చైతన్యం తెస్తోంది. హోదాకోసం ఎందాకైనా అంటూ జగన్ ముందుకెళ్తున్నారు. హోదా ఆంధ్రుల హక్కు అని, ప్రజల్లో చైతన్యం పెల్లుబుకుతున్న పరిస్థితులతో పాటు, బిజెపితో ఉన్న సంబంధాలు బెడిసి కొట్టడంతో చంద్రబాబు ప్రత్యేక హోదాపై మొదటి నుంచి పోరాడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారు.
తనకుమించిన పోరాట యోధుడు లేడంటూ చెప్పుకుంటున్నారు. ఇంత చేస్తున్న ఈ పెద్దమనిషి తనపార్టీ ఎంపీలతో శీతాకాల సమావేశాల్లో ఒక్క రోజు కూడా హోదాపై మాట్లాడించలేకపోయారు. గతంలో లావు తగ్గడానికే నిరాహార దీక్షలు చేస్తున్నట్లుగా బహిరంగంగా ప్రకటించిన టిడిపి ఎంపిలు కూడా ప్రస్తుత సమావేశాల్లో హోదాతో తమకు సంబంధం లేనట్లుగా ఉంటున్నారు.
ప్రస్తుత లోకసభ చివరి శీతాకాల సమావేశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని, కేంద్రంపై వత్తిడి తేవాల్సిన టిడిపీ ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు ఫొటోలు పెడుతున్నారు. వీరి వ్యవహారశైలి చూసిన ప్రజలు చంద్రబాబుతో కలిపి థూ మీ బతుకు చెడ అని విమర్శిస్తున్నారు. ఇప్పటికే హోదాపై కేంద్ర వైఖరి నిరసిస్తూ పదవులకు రాజీనామా చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన 5 మంది లోక్ సభ సభ్యులు శీతాకాల సమావేశాల ప్రారంభపు రోజు హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన గళం వినిపిస్తున్నారు. అలాగే ఈ నెల 27 వ తేదీన ఢిల్లీలో దీక్షను చేపట్టనున్నట్లు వైసీపీ ప్రకటించింది. జగన్ హోదా విషయంలో ఎంతవరకైనా వెళ్తామని ప్రకటించారు.