ఇటివల కాలంలో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు చెందిన క్రికెటర్ హనుమాన్ విహారి తనదైన శైలిలో ఆటను ప్రదర్శించి అందరి మన్నలను అందుకున్నాడు.అదే తరహాలో ఇండియా తరుపున ఆడే ఛాన్స్ వచ్చింది.ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నాడు.ఇతడిని ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ దక్కించుకుంది.అంతే కాకుండా నిన్న జరిగిన వేలం లో మన రాజోలు గ్రామానికి చెందిన బండారు అయ్యప్పను ఢిల్లీ కాపిటల్స్(DCS) జట్టు మరోమారు ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2018లో అయ్యప్పను దక్కించుకున్న ఢిల్లీ కాపిటల్స్ ఈసారి కూడా రూ.20 లక్షలకు అతన్ని జట్టులోకి తీసుకుంది.
మీడియం పేసర్ అయ్యప్ప 2018-19 దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టుకు సెలెక్ట్ అవ్వడం విశేషం. కాగా, ఐపీఎల్ 2019లో 351 ఆటగాళ్లు వేలానికి రాగా… 60 మందిని 8 ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.ఇదిలాఉండగా.. తొలి రౌండ్‌లో యువరాజ్‌ను పక్కకు పెట్టిన ఫ్రాంచైజీలు.. రెండో రౌండ్ వేలంలో కనీస ధర కోటి రూపాయలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.ఇక రూ. 8.40 కోట్లు టీమ్‌ఇండియా పేసర్ జైదేవ్ ఉనద్కత్‌కు దీటుగా అన్‌క్యాప్‌డ్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేలంలో జాక్‌పాట్ కొట్టారు.ఆ తరువాత స్థానంలో శివమ్ దూబే, అక్షర్ పటేల్‌కు చెరో రూ. 5 కోట్లు ధర పలికారు.విదేశీయుల్లో ఆటగాళ్లలో ఇంగ్లాండ్ నుండి కరన్,సౌత్ఆఫ్రికా నుండి కాలిన్ ఇంగ్రామ్ అత్యధిక ధర పలికారు.