టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల తారకరామారావు పార్టీ బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ నెల 20 నుంచి కేటీఆర్ జిల్లాల పర్యటనలు పర్యటన ప్రారంభించనున్నారు. ఈ నెల 20 నుంచి జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నారు. మొదటగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు ఆయన హామీ ఇచ్చారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు కడియం శ్రీహరి, ఎంపీలు సీతారాంనాయక్, బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి తదితరులు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తొలి పర్యటన వరంగల్ జిల్లా నుంచే ప్రారంభించాలని చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా కేటీఆర్ తొలుత జనగామలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతారు. అనంతరం బాలసముద్రంలో వరంగల్ అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసి.. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జిల్లా ముఖ్య నాయకులతో సమావేశమై పార్టీ అభివృద్ధికి కార్యాచరణ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిన సమస్యలపై
చర్చించనున్నారు.
ఇది లాఉండగా జిల్లాల పర్యటనల విషయంలో కేటీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయాల సొంత భవనాల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. త్వరలో జరుగనున్న గ్రామపంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలతోపాటు సభ్యత్వ నమోదు, రానున్న ఆరునెలలకు కార్యాచరణను పార్టీ క్యాడర్‌కు కేటీఆర్ వివరించనున్నారు. ప్రతీ గ్రామపంచాయతీలో పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. వీలైనంతవరకు ఎక్కువ పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రభుత్వం నుంచి రూ.పది లక్షల బహుమతి పొంది గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించనున్నారు. అదేవిధంగా త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయనున్నారు.