తెలంగాణలో స్వైన్‌ఫ్లూ భయం మొదలైంది.మరోమారు స్వైన్‌ఫ్లూ పంజా విసిరింది.రెండు రోజులుగా చలిగాలులు వీచడంతో స్వైన్‌ఫ్లూ వేగంగా విస్తరిస్తుంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఒక వృద్ధుడు మరణించాడు.మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వైరల్ జ్వరాలు, డెంగ్యూలాంటి జ్వరాలు ప్రబలుతున్నాయి. గాంధీ ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య రెండ్రోజులుగా గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం.ప్రజలు భయందోనలో ఉన్నారు.
